![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -264 లో.. అలేఖ్య షాపింగ్ కి వెళదామని మధుకి చెప్పగానే.. తను రానని అనడంతో మధుని అలేఖ్య తిడుతుంది. మరొక వైపు ఇంట్లో ఏంటి హడావిడి లేదు. ఎవరు ఇంకా లేవలేదా అంటూ రేవతిని భవాని పిలుస్తుంది. ఇంట్లో ఎవరికి క్రమశిక్షణ లేకుండా పోయింది. ఎవరు టైమ్ కి లేవట్లేదని భవాని అంటుంది.
ఆ తర్వాత కృష్ణ ఎక్కడ అని రేవతిని భవాని అడుగుతుంది. ఇంకా లేచినట్లు లేదని సమాధానం చెప్పగానే.. అప్పుడే ముకుంద వస్తూ.. కృష్ణ హాస్పిటల్ కి వెళ్ళిందని, అర్జెంట్ సర్జరీ ఉందని ముకుంద చెప్తుంది. అందుకే నేనే వెళ్లి మురారికి కాఫీ ఇచ్చి వస్తున్నాను. మీకు కాఫీ తీసుకొని రమ్మంటారా అని ముకుంద అనగానే.. భవాని ఆశ్చర్యంగా నీకు కాఫీ కూడా పెట్టడం వచ్చా అని అడుగుతుంది. అన్ని ఇక నేర్చుకుంటాను. అయన కోసమని ముకుంద అనగానే.. అయన అంటే ఎవరని రేవతి అడుగుతుంది. ఆదర్శ్ వస్తున్నాడని అన్ని నేర్చుకుంటుందని భవాని అంటుంది. అవును మీరు రప్పిస్తానని అన్నారు కదా అని ముకుంద అంటుంది. వంట కూడా నేనే చేస్తానని ముకుంద అనగానే.. భవాని హ్యాపీగా ఫీల్ అవుతు ఇన్ని రోజులకి మంచి నిర్ణయం తీసుకున్నావని అంటుంది. నాకు తెలుసు ఇదంతా మురారి కోసమని రేవతి తన మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత నేను మురారికి చేసే సేవలు చూసి, నాకు మురారి అంటే ఎంత ఇష్టమో నా జీవితంలో మురారికి తప్ప ఇంకెవరికి స్థానం లేదని కృష్ణ తెలుసుకోవాలని ముకుంద అనుకుంటుంది.
మరొక వైపు కృష్ణ త్వరగా హాస్పిటల్ కి వెళ్ళిపోయి ఆలోచిస్తుంటుంది. నాకు అసలు ఆ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండాలనిపించడం లేదని కృష్ణ బాధపడుతుంది. ఆ తర్వాత పరిమళ మేడమ్ వచ్చి.. ఎందుకు డల్ గా ఉన్నావ్? ఇంట్లో మురారీతో ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతుంది. అదేం లేదని కృష్ణ అంటుంది. ఆ తర్వాత కృష్ణ దగ్గరికి మురారి వస్తాడు. అయిన కృష్ణ మాట్లాడడానికి ఇష్టపడదు. ఆ తర్వాత మొన్న ఒక ఆర్మీ అతను హాస్పిటల్ కి వచ్చాడు. యుద్ధం అయిపోయి, అందరూ లీవ్ లో ఇంటికి వచ్చేసారంట కదా? మరి ఆదర్శ్ ఎందుకు రాలేదని మురారిని కృష్ణ అడిగి వెళ్ళిపోతుంది. మరొక వైపు నువ్వు కృష్ణని మోసం చేస్తున్నావని అనిపించడం లేదా అని ముకుందను రేవతి అడుగుతుంది. లేదు.. వాళ్ళు అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకొని మనకు తెలియకుండా ఉంచడం మోసం కాదా అని ముకుంద అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |